ad1
ad1
Card image cap
Tags  

  30-12-2023       RJ

అయోధ్యను ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుతాం: ప్రధాని మోదీ

జాతీయం

అయోధ్య, (డిసెంబర్ 30): యావత్ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం రోజు కోసం ఎదురుచూస్తోందని, జనవరి 22న జరిగి కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఉంటుందని, అయితే అది సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొందరినే ఈ మహోజ్వల ఘట్టానికి ఆహ్వానించినందున ఆరోజు రావాలని అనుకోవద్దని ప్రజలను కోరారు. లాంఛనంగా రామాలయం ప్రారంభం కాగానే ఎవరికి వారు తమ వీలును బట్టి వచ్చి భగవాన్ రామ్ ను దర్శించుకోవచ్చని సూచించారు.

అయోధ్యలో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభించారు. పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 22వ తేదీ చారిత్రక క్షణాల కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని, సహజంగానే అయోధ్య వాసుల్లో మరింత ఎక్కువ ఉత్సాహం తొంగిచూస్తోందని అన్నారు. ఈ పుణ్యభూమిలోని అణువణువునూ తాను ఆరాధిస్తుంటానని, అందరిలాగే తాను కూడా రామమందిరం ప్రారంభమయ్యే ఘడియల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

22న మరో దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో సుందర శ్రీరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో అయోధ్యలో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ రోజున సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలగాలన్నారు.

అందుకే జనవరి 22 వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23 వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని మోదీ సూచించారు. ప్రజలు ఎవరూ అయోధ్యకు వచ్చి ఇబ్బంది పడకూడదనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్ తోపాటు మహర్షి వాల్మీకి ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు.

రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జనవరి 22న అయోధ్యకు రావద్దని ప్రజలను కోరారు. మీరు 550 సంవత్సరాలకు పైగా వేచి ఉన్నారు, మరికొంత కాలం వేచి ఉండండి అంటూ పిలుపునిచ్చారు. కాగా ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున లంకను జయించి.. సీతాదేవితో కలిసి శ్రీ రాముడు అయోధ్య కు తిరిగొచ్చాడని అంటారు. రామయ్య రాకను స్వాగతిస్తూ అయోధ్య ప్రజలు దీపాలు వెలిగిస్తారట.

ప్రస్తుతం రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో మోదీ ఈ మేరకు పిలుపునిచ్చారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట తరువాత, తమ సౌలభ్యం ప్రకారం అయోధ్యకు రావాలని సూచించారు. జనవరి 22న ఇక్కడికి రావడానికి తమ మనస్సును మార్చుకోకండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మహత్తర కార్యక్రమానికి సన్నాహాలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయని, ఇందులో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. గుడి ఎక్కడికీ వెళ్లదు కాబట్టి ఇక్కడ రద్దీగా ఉండకండి. ఇది శతాబ్దాల పాటు కొనసాగుతుంది.

ఈ వేడుకకు కొందరికే ఆహ్వానం అందిందని ప్రధాని తెలిపారు. అందుచేత ఆహ్వానించబడిన వారు మాత్రమే అయోధ్యకు రావాలన్నారు. జనవరి 23వ తేదీ తర్వాత ప్రతి ఒక్కరికి ఆయోధ్య ప్రయాణం సులువవుతుందన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం అదృష్టవశాత్తూ మనందరి జీవితాల్లోకి వచ్చిందని, ఈ సందర్భంగా 140 కోట్ల మంది దేశప్రజలు జనవరి 22న తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా, అయోధ్య నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

అయోధ్య ఇప్పుడు లక్షలాది మంది సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలన్నారు. నిత్యం సందర్శకులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అయోధ్యను దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు అయోధ్య ప్రజలు ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. డిసెంబర్ 30వ తేదీ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుందని, ఇండియా ఫ్రీడం ప్రకటన చేస్తూ నేతాజీ సుభాస్ చంద్రబోస్ 1943లో ఇదేరోజు అండమాన్లో భారతదేశ పతాకాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. ప్రపంచంలోని ఏదేశమైనా అభివృద్ధిలో పతాక స్థాయికి చేరుకోవాలనుకుంటే ఆ దేశవారసత్వ సంపదకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ అన్నారు.

రామ్ లల్లా ఒక టెంట్లో ఉండేవాడని, ఇవాళ రామ్లల్లాకు ఆలయం ఉవ్వడం జరిగిందని, రామ్ లల్లాకు మాత్రమే కాకుండా దేశంలోని 4 కోట్ల పేద ప్రజానీకానికి పక్కా ఇళ్లు కల్పించామని చెప్పారు. అయోధ్యలో ఈరోజు రూ.15,000 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభమయ్యాయని, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ఈ పనులు పూర్తయితే మోడ్రన్ అయోధ్య రూపుదిద్దుకుని దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. అయోధ్య అభివృద్ధి స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తెలిపారు. నేడు భారతదేశం పర్యాటక స్థలాల సుందరీకరణతో పాటు డిజిటల్ టెక్నాలజీతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటోందని చెప్పారు.

అయోధ్య ధామ్ జంక్షన్ తో పాటు ఎయిర్పోర్టీని ప్రారంభించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ వాల్మీకి మహర్షిని స్మరించుకుంటారని అన్నారు. అందుకే విమానాశ్రయానికి ఆ మహర్షి పేరు పెట్టామని తెలిపారు. అయోధ్య రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాక 70 వేల మంది ప్రయాణించేందుకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు. ఆలయాల పునర్ నిర్మాణాలతో పాటు అభివృద్ధిలోనూ భారత్ దూసుకుపోతోందని స్పష్టం చేశారు.

అయోధ్యలో కొత్త టౌన్షిప్ నిర్మాణం జరుగుతోందని ప్రకటించారు. తొలి అమృత్ భారత్ రైలు అయోధ్య నుంచే ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయోధ్య ధామ్ జంక్షన్తో పాటు ఎయిర్పోర్ట్న ప్రారంభించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ వాల్మీకి మహర్షిని స్మరించుకుంటారని అన్నారు. అందుకే విమానాశ్రయానికి ఆ మహర్షి పేరు పెట్టామని తెలిపారు. అయోధ్య రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాక 70 వేల మంది ప్రయాణించేందుకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు.

ఆలయాల పునర్నిర్మాణాలతో పాటు అభివృద్ధిలోనూ భారత్ దూసుకుపోతోందని స్పష్టం చేశారు. ఈ రామ మందిర నిర్మాణ అయోధ్య వాసుల కష్టానికి ప్రతిఫలం అని తేల్చి చెప్పారు. దేశ చిత్రపటంలో అయోధ్యను ప్రత్యేకంగా నిలబెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి అయోధ్య స్ఫూర్తిగా మారనుందని అన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికీ సులభంగా రాముడి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, బ్రిజేష్ పాఠక్ కేశవ్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP