01-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 1): వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు ఇండియా కూటమిని బలోపేతం చేస్తూనే.. స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా సీట్లు సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లలో స్వతంత్రంగా పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సుమారు 290 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
రెండ్రోజుల పాటు డిసెంబర్ 29-30 తేదీల్లో జరిగిన అలయెన్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లలో స్వతంత్రంగా పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సుమారు 290 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. రెండ్రోజుల పాటు డిసెంబర్ 29-30 తేదీల్లో జరిగిన అలయెన్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
కూటమి వ్యూహాలను రూపొందించేందుకు ఏర్పాటైన అలయెన్స్ కమిటీ ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించనుంది. దీనికి ముందుగా, జనవరి 4న ఆయన ఒక కీలక సమావేశాన్ని ఖర్గే ఏర్పాటు చేయబోతున్నారు. సీట్ల పంపకాల ఏర్పాట్లను ఖరారు చేసేందుకు అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కాగా, దేశవ్యాప్తంగా తమ భాగస్వామ్య పార్టీల నుంచి 85 లోక్ సభ సీట్లను కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పార్టీ అంతర్గత చర్చలు అనంతరం భాగస్వామ్య పార్టీలతో సీట్ల పంపకాల ఒప్పందాన్ని స్థిరపరచేందుకు తదుపరి సంప్రదింపులు జరుపనుంది. తద్వారా కూటమి భాగస్వామ్య పార్టీలను మరింత బలపడేలా చేస్తూనే గరిష్టంగా ఎన్నికల గెలుపు అవకాశాలను మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సీట్ల పంపకాల అంశంలో గందరగోళం నెలకొందన్న వార్తలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎంపి సుప్రియా సూలే సోమవారం కొట్టిపారే శారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాకరేల మధ్య గతేడాది డిసెంబర్లో జరిగిన సమావేశంలో సీట్ల పంపంకంలోని అన్ని విషయాలపై స్పష్టత వచ్చిందని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరో 8-10 రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడుతుందని అన్నారు. పొత్తులో ఉన్నందున సీట్ల పంపిణీ ఫార్ములాలో హెచ్చు తగ్గులు వస్తుంటాయని చెప్పుకొచ్చారు. డా. అంబేద్కర్ మనవడు, మాజీ ఎంపి ప్రకాష్ అంబేద్కర్ ఇండియా ఫోరంలో కీలక పాత్ర పోషిస్తారని మీడియా ప్రశ్నకు సమాధాన మిచ్చారు. ఇకపోతే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా బ్లాక్ లో తొలి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కూటమిలో కీలక బాధ్యతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమర్ కు అప్పగించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం వరకూ కూటమి తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ను కూటమి కన్వీనర్ గా చేసే విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ గా పరిశీలిస్తోంది. ఇది జనతా దళ్ (యూనైటెడ్) చిరకాల డిమాండ్ గా కూడా ఉంది. నితీష్ క్కు కూటమి కన్వీనర్ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. కుల ఆధారిత లెక్కలు, రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ముందు కాంగ్రెస్ తమను ముందుగా సంప్రదించ లేదని నితీష్ ఇటీవల ఆ పార్టీపై గుర్రుమన్నారు. జేడీయూలో ఎలాంటి చీలకలకు ఆస్కారం లేకుండా నితీష్ కుమార్ ఇటీవల వేగంగా పావులు కదిపారు.
పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో జేడీయూ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ వెంటనే జేడీయూ చీఫ్ పగ్గాలు నితీష్ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. కీలకమైన లోక్ సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పార్టీ దిగ్గజమైన నితీష్ కుమార్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ ప్రముఖులు నిశ్చతాభిప్రాయం వ్యక్తం చేశారు. అదీగాకుండా, లలన్ సింగ్ పనితీరు, నితీషను కీలకవ్యక్తిగా ఫోకస్ చేసే విషయంలో ఇండియా కూటమి నేతలతో సరైన రీతిలో ఆయన వ్యవహరించకపోవడంపై కూడా ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.
బీహార్ లోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీకి లలన్ సింగ్ దగ్గరవుతున్నారనే సంకేతాలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో లలన్ సింగ్ రాజీనామా చేయడం, పార్టీ చీఫ్ పగ్గాలు నితీష్ దక్కించుకోవడం ద్వారా పార్టీపై తనకున్న పట్టును నితీష్ మరోసారి నిరూపించుకున్నారు.