01-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 1): డిసెంబర్ నెలలో వస్తు, సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు 9 నెలల కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.14.97 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ శాతం 12? ఎక్కువ పన్ను వసూలు వచ్చాయి.
దీంతో పాటు ఈ 9 నెలల్లో నెలవారీ సగటున 1.66 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అలాగే డిసెంబర్ నెలలో రూ.1,66,882 కోట్ల పన్ను ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. నవంబర్ తో పోలిస్తే డిసెంబర్ లో పన్ను వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి.