01-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 1): కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్ జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్ ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఓఊం) ఒక ట్వీట్ తెలియజేసింది. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యోదంతంతో గోల్డీ బ్రార్ పేరు ఒక్కసారి ప్రచారంలోకి వచ్చింది. దీనికి ముందే ఆయనపై పలు కేసులు ఉన్నాయి.
రాపర్ హనీసింగ్ నుంచి రూ.50 లక్షల రూపాయలు అక్రమవసూళ్లు, పాకిస్థాన్ నుంచి ఇండియాకు ఆయుధాల స్మగ్లింపు, హత్య, హత్యాయత్నం సహా పలు కేసుల్లోనూ గోల్డీ బ్రార్ నిందితుడిగా ఉన్నాడు. విదేశాల్లో ఉంటూ ఇండియాలో క్రిమినల్ కార్యక్రమాలకు పాల్పడుతున్న అభియోగాలున్నాయి. ఈ ఘటనలకు తానే బాధ్యుడినంటూ సోషల్ మీడియా ద్వారా గోల్డీ బ్రార్ ఒప్పుకున్నాడు. కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ మధ్య చిరకాల స్నేహం ఉంది.
లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉండగా, గోల్డీ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. గోల్డీబార్ 1994లో పంజాబ్ లోని శ్రీముకర్తసర్ సాహిబ్ లో జన్మించాడు. అతని తండ్రి పోలీసు ఇన్ స్పెక్టర్గా ఉన్నప్పటికీ నేరజీవితానికి గోల్డీ అలవాటు పడ్డాయి. తన కజిన్ బ్రార్ హత్య అనంతరం నేరజీవితం వైపు గోల్డీ మళ్ళాడు. ఆ తర్వాత పలు నేరాలకు పాల్పడ్డాయి. స్టూడెంట్ వీసా సంపాదించి కెనడాకు పారిపోయాడు. అక్కడి నుంచి పంజాబ్ లో నేరాలు జరిపిస్తున్నాడు. వీటిపై పంజాబ్ లో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అతనిపై రెడ్-కార్నర్ నోటీసు కూడా జారీ అయింది.