05-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 5): కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959, జనవరి 6న ఛండీగడ్ లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత అల్రౌండర్లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 2002లో పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్ గా గుర్తింపు పొందినాడు. 1983లో సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ పోటీలో భారత్ ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్ రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు.
సాధించిన రికార్డులు 1994, జనవరి 30న శ్రీలంకపై బెంగుళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజీలాండ్ కు చెందిన రిచర్డ్ హాడ్లీ రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించాడు. తరువాత ఇతని రికార్డు కూడా ఛేదించబడింది. టెస్ట్ క్రికెట్ లో 4000 పరుగులు మరియు 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి అల్ రౌండర్ గా రికార్డు సృష్టించాడు.1988లో జోయెల్ గార్నల్ రికార్డును అధికమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించాడు. తరువాత 1994లో పాకిస్తాన్ కు చెందిన వసీం అక్రం ఈ రికార్డును ఛేదించాడు.
వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు. లార్డ్స్ మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాట్ స్మెన్ గా అవతరించాడు. అవార్డులు 1979-80 లో అర్జున అవార్డు 1982, 1983లో పద్మశ్రీ అవార్డు1, 1991లో వి--డజెన్ క్రికెటర్ ఆఫ్ దొ ఇయర్ అవార్డు, 2002లోపద్మవిభూషణ్ అవార్డు, వి+- డజెన్ ఇండియన్ క్రికెటర్ అఫ్ ది సెంచరీ 2013లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంవత్సరానికి గానూ కల్నల్ సికె నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు.
ఈ పురస్కారంలో భాగంగా ఆయనకు ట్రోఫీ, 25 లక్షల చెక్ అంజేస్తారు. అల్ టైమ్ గ్రేటెస్ట్ అల్ రౌండర్లలో ఒకడైన కపిన్ భారత్ తరపున 131 టెస్టులు ఆడి 434 వికెట్లు పడగొట్టాడు. ఇదే ఫార్మాట్ లో 400 వికెట్లు, 500 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 225 వన్డేలు ఆడిన కపిల్ 253 వికెట్లు తీసి 3783 పరుగులు సాధించాడు. ఇతని సారథ్యంలోనే భారత జట్టు 1983లో ప్రపంచ కప్ సాధించింది.