05-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, (జనవరి 5): ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్ సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరో ఇద్దరు ఐఏఎస్ లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే టీఎస్ పీఎస్ సీని ప్రక్షాళన చేస్తామన్న రేవంత్..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే టీఎస్ పీఎస్ సీ బోర్డులోని చాలా మంది అధికారులు రాజీనామా చేశారు. కేరళలో ఇప్పటికే పర్యటించి... అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించింది అధికారుల బృంద పరిశీలించింది. ఈ క్రమంలోనే యూపీఎస్సీ ఛైర్మన్ తో చర్చించిట్లు సమాచారం. యూపిపిఎస్స తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనను పటిష్టం చేయాలని సిఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.
గురువారం ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా ఆయన ప్రభుత్వ చర్యలను వేగవంతం చేశారు. ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరికొందరు ఉన్నతాధికారులు కలిశారు. యూపీఎస్సీ పనితీరు పరిశీలించి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు అధ్యయనం చేస్తున్నారు.