06-01-2024 RJ
జాతీయం
పంబ, (జనవరి 6): అయ్యప్పలు ప్రయాణించే కేఎస్ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. పంబా... నీలక్కల్ మార్గ మధ్యలో కేఎస్ ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు చెబుతున్నారు. నీలక్కల్ నుంచి అయ్యప్ప యాత్రికులతో పంబకు చేరుకున్న కేరళ ఆర్టీసీ బస్సులో శనివారం ఉదయం 8:30 గంటలకు బస్సులో మంటలు చెలరేగాయి.
సమీపంలోనే అగ్నిమాపక కేంద్రం ఉండడంతో మంటలు అదుపుచేశారు. అప్పుడే అయ్యప్పలు అందరు బస్సు దిగారు. మంటలు చెలరేగిన సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉన్నారు. బస్సు మధ్యలో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన వారు బస్సు దిగారు. ఎదురుగా అగ్నిమాపక కేంద్రం ఉండటంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.