10-01-2024 RJ
జాతీయం
ముంబై, జనవరి 10: ప్రపంచ దేశాల్లో పసిడి ధరలపైనే మనదేశంలోనూ బంగారం ధరలు ఆధారపడి వున్నాయి. పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి.
ప్రపంచ మార్కెట్ లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్ల లోని డిమాండ్ లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
ఇన్షన్ డేటా మీద పెట్టుబడిదార్లు దృష్టి పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు స్టెడీగా కదులుతోంది. ప్రస్తుతం, ఔన్స్ అంటే 28.35 గ్రాముల బంగారం ధర 2,035 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర 100 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 100 రూపాయలు, 18 కేరెట్ల గోల్డె రేటు 80 రూపాయల చొప్పున పతనమయ్యాయి. కిలో వెండి రేటు రూ. 200 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు హెచ్చు తగ్గుదలతో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో...
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,700 వద్దకు
24 క్యారెట్ల బంగారం ధర 62,950 వద్దకు
18 క్యారెట్ల బంగారం ధర 47,210 వద్దకు చేరింది.
వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో..
కిలో 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ? 57,700 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ? 62,950 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర 47,210 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ? 78,000 గా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ 58,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 63,490 కి చేరింది. కోయంబత్తులోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 57,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 62,950 కి చేరింది.
పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 57,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 63,100 గా నమోదైంది. జైపుర్, లఖ్నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. కోల్ కతా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 57,700 గా, 24 క్యారెట్ల బంగారం ధర 62,950 గా ఉంది. నాగుర్ లోనూ ఇదే రేటు అమల్లో ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 57,700గా, 24 క్యారెట్ల బంగారం ధర 62,950 గా ఉంది.
మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది. కేరళలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 58,000 గా, 24 క్యారెట్ల బంగారం ధర 63,050గా ఉంది. భవనేశ్వర్ లోనూ ఇదే రేటు అమల్లో ఉంది. దుబాయ్ 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 52,088.31 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,273.47 వద్దకు చేరింది. షార్జా, అబుదాబిలో ఇవే రేట్లు అమల్లో ఉన్నాయి.
మస్కట్ లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 53,986 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,577.33 వద్దకు చేరింది. కువైట్ లోగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 53,279.24 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,389.45 వద్దకు చేరింది. మలేసియాలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ 54,216.70 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,542.83 వద్దకు చేరింది.
సింగపూర్ లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 52,851.37 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 58,855.79 వద్దకు చేరింది. అమెరికాలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 52,340.27 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,909.66 వద్దకు చేరింది.