10-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 10: అయోధ్యలో రామ మందిర్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఏఐసీసీ ఛీప్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అదిర్ రంజన్ చౌదరి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. నిర్మాణాలు పూర్తికాకుండానే రాజకీయ లబ్ది కోసమే రామ్ మందిర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ది కోసమే కార్యక్రమం నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. కోట్లాది మంది సెంటిమెంట్ ను తాము గౌరవిస్తాం.. అయోధ్యపై రాజకీయాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
రాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారు. కానీ మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలాకాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారు చేశారని ఆరోపించారు. అసంపూర్తిగా నిర్మించిన అయోధ్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రారంభించడం ఎన్నికల లబ్దికోసమే ముందు ప్రారంభిస్తున్నారని స్పష్టమవుతోంది. అయితే తాము 2019 సుప్రీంకోర్టుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిర్ ప్రారంభానికి హాజరు కావాల్సిందిగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో హాజరుకావడం లేదని ప్రకటించింది.
అది భాజపా, ఆర్ఎస్ఎస్ కు చెందిన పొలిటికల్ ప్రాజెక్ట్ అని వ్యాఖ్యానించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరికి ఆహ్వానం దేశంలోని లక్షలాది మంది రాముని ఆరాధిస్తారని, మతం అనేది వ్యక్తిగత అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే చిరకాలంగా అయోధ్యలోని రామాలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా బీజేపీ మార్చిందని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న రామాలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెరపైకి తెచ్చిందన్నారు.
2019 సుప్రీంకోర్టు తీర్పును, రాముని ఆరాధించే కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, అయితే ఇది స్పష్టంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా మార్చినందున మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, అధీర్ రంజన్ చౌదరి మర్యాద పూర్వకంగా ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్టు జైరామ్ రమేష్ ఆ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. 2024 జనవరి 22న జరిగే ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు.
కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ప్రారంభోత్సవానికి తాము దూరంగా ఉంటామని సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ వెల్లడించిన నిర్ణయం.. భాజపా, హస్తం పార్టీ మధ్య మాటల యుద్దానికి దారితీయనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోపక్క విపక్ష 'ఇండియా' కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా తాము హాజరుకావడం లేదని చెప్పింది. ఇవన్నీ భాజపాకు సానుకూలంగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.