10-01-2024 RJ
జాతీయం
అయోధ్య, జనవరి 10: ఈ నెల 22న అయోధ్యలో జరిగే శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట రోజున రాష్ట్రంలో మద్యం షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మాంసాన్ని కూడా అమ్మరాదని స్పష్టం చేసింది. అదే విధంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. కాగా అయోధ్యలో ఆరంచెల భద్రత వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 600 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తోంది.