11-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 11: ప్రధాని నరేంద్ర మోదీ అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. గురువారం నాడు ఢిల్లీలో ముస్లిం మత ప్రముఖులు మోదీని అతని నివాసంలో కలిశారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీ పై కప్పేందుకు చాదర్ ను అందజేశారు.
ప్రధాని మోదీ ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిస్తారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై చాదర్ కప్పే సమయంలో ఆ సందేశం చదువుతారు.