12-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 12: ఈ నెల 22వ తేదీన అయోధ్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు ముందుగా దాదాపు 11 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ క్రమంలోనే 'అనుష్ఠానం' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మేరకు స్వయంగా మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
అధికారిక యూట్యూబ్ ఛానల్లో వాయిన్ మెసేజ్ ని అప్లోడ్ చేశారు. ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇదో చారిత్రక ఘటన అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ వేడుకను నా చేతుల మీదుగా జరగాలనే ఆ దేవుడు నాకీ జన్మ ఇచ్చినట్టున్నాడు. దేశ ప్రజలందరికీ ప్రతినిధిగా నేనీ ప్రాణప్రతిష్ఠ చేస్తాను. శుక్రవారం నుంచి 11 రోజుల పాటు పలు కీలక కార్యక్రమాలు జరుగుతాయి. అసలు ఈ ఘట్టాన్ని తలుచుకుంటేనే నేను భావోద్వేగానికి లోనవుతున్నాను. నా జీవితంలో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే తొలిసారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయని, ఇదంతా ఆ దైవ సంకల్పమే అని భావోద్వేగానికి లోనయ్యారు ప్రధాని మోదీ.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులంతా ఉప్పొంగిపోయే సందర్భమని అన్నారు. ప్రతి చోటా రాముడే కనిపిస్తున్నాడని చెప్పారు. అయోధ్య రామ మందిరాన్ని దేశానికే తలమానికంగా నిలిచేలా నిర్మించారు. ఈ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కేవలం 11 రోజులు మాత్రమే ఉంది. జనవరి 22న ఈ ఆలయాన్ని పలువురు ప్రముఖుల చేతుల మీదుగా హోమాది క్రతువులు నిర్వహించి శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నారు.
ఈ మహోత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ దేశం సహస్రకోటి కళ్లతో దురుచూస్తోంది. ఈ తరుణంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. అయోధ్య రాంలాల్ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది. ఈ అద్భతమైన ఘట్టంలో మీ అందరి తరఫున పాల్పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు.
శ్రీ రామచంద్ర ప్రభువు మీ అందరి ప్రతినిధిగా నన్ను ఎంచుకుని నాకు ఈ మహదావకాశాన్ని కల్పించారని వివరించారు. అందుకే నేను దీక్ష చేపట్టాలని సంకల్పించానన్నరు. పురాణ ఇతిహాసాల ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ అనేది అనేక నియమాలతో కూడిందని చెప్పారు.
అందులో భాగంగా రామ భక్తుడిగా, ఆధ్యాత్మిక సాధన స్ఫూర్తితో ప్రధానమంత్రి రామమందిర ప్రతిష్టాపనకు అంకితమయ్యారు. దీని కోసం ప్రధానమంత్రి తన దినచర్యలో బ్రహ్మముహూర్త లేవడం, ప్రాణాయామ సాధన చేయడం, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం వంటివి పాటించేందుకు సిద్ధమైనట్లు వివరించారు. ఇలా 11 రోజుల పాటు విధిగా కఠోర తపస్సుతో ఉపవాసం దీక్షను పాటించాలని ప్రధాని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎక్స్ ట్విట్టర్ వేదికగా దేశప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. వాహనదారులకు ఏ సమస్య ఉన్నా 1033ను సంప్రదించాలని పేర్కొన్నారు.
అటు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. తెలంగాణ నుంచి 4.484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు, ఏపీఎస్ఆర్టీసీ సైతం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 6,725 బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్ సర్వీసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్ సర్వీసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. వీటికి అదనంగా మరో 1000 బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్వీసులు నడుపనున్నట్లు చెప్పారు.
అలాగే బెంగళూరు, చెన్నైల నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సువిలు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.