ad1
ad1
Card image cap
Tags  

  12-01-2024       RJ

గోదాకళ్యాణంతో ముగియనున్న ధనుర్మాసం

జాతీయం

చెన్నై, జనవరి 12: ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. సూర్యుడు ఏడాదిలో ప్రతి నెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. మార్గశిరంలోనే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ధనుర్మాసంలో.. తెల్లవారుజాము నుంచే పండగ వాతావరణం నెలకొంటుంది.

పొద్దుపొడవక ముందే కళ్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, వూళ్లోని రామాలయానికో, వేంకటేశ్వర ఆలయానికో తరలి వెళుతుంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం. శ్రీరంగ నాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు 'తిరుప్పావై' పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.

తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ఆలయం మధురభక్తిని నేటికీ చాటుతోంది. ధనుర్మాసం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. గోదాదేవి జన్మనక్షత్ర సమయంలో ఇక్కడ జరిగే రథోత్సవం, గోదాకల్యాణం వైభవంగా జరుగుతాయి.. ఈ ఆలయం నుంచి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలేశుడికి పూలహారాలు పంపించడం ఆనవాయితీ. మాసాల్లో మార్గశీర్షం నేను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెబుతాడు.

తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుడనే శ్రీరంగడి భక్తుడికి గోదాదేవి పసిబాలికగా ఉన్నప్పుడు దొరికింది. చిన్నప్పటి నుంచి ఆమెకు రంగడంటే వల్లమాలిన ప్రేమ. స్వామివారికి సమర్పించమని తన తండ్రి ఇచ్చిన పూలహారాలను ముందు తాను ధరించి స్వామికి ధరింపజేసేది గోదా! చివరకు శ్రీరంగడిని మనువాడి తన జన్మను చరితార్థం చేసుకుంది. తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ధనుర్మాసమంతా సుప్రభాత సేవలో గోదాదేవి పాశురాలు ఆలపిస్తారు.

గోదాదేవి కృష్ణభక్తికి ప్రతీకగా శ్రీవారి పవళింపు సేవ రజత కృష్ణస్వామి మూర్తికి నిర్వహిస్తారు. 12 అంతస్తులున్న విల్లిపుత్తూరు రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. 192 అడుగుల ఎత్తున్న రాజగోపురం నమూనా తమిళనాడు ప్రభుత్వ అధికార ముద్రగా చెలామణీలో ఉంది. ఈ ఆలయంలో శనివారం గోదా కళ్యాణం అత్యంత రమణీయంగా నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు, అనేక వైష్ణవాలయాల్లో గోదాకళ్యాణ ఏర్పాట్లు చేశారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP