12-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి12: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 609 కేసులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 3వేల 368 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గురువారం ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దీంతో కరోనా మరణాల సంఖ్య 5,33,412కి చేరింది. ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.