16-01-2024 RJ
జాతీయం
ముంబై, జనవరి 16: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దగ్గరవుతున్న కొద్దీ సెలబ్రెటీలకు వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. ఇండియన్ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లికి తాజాగా అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చింది. ఈనెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వాన పత్రిక అందజేసింది.
దేశవ్యాప్తంగా 1100 మంది అతిథులు అయోధ్య ఈవెంట్లో పాల్గొంటున్నారు. మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనికి ఇటీవల అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గోనున్నారు. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ లోని కుబేర్ నవరత్న తిలను దర్శించడంతో పాటు, జటాయువు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.