17-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 17: తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9మంది అధికారులను కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్ కు చెందిన వాళ్లు.
తెలంగాణకు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరుగురిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన అధికారులు పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది.