18-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 18: దావోస్ వల్డ్ ఎకానమిక్ ఫోరంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. అక్కడ పారిశ్రామిక రంగానికి సంబంధించి నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. వివిధ దేశాల ప్రతినిధులతో తమ ప్రభుత్వం ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానాన్ని వెల్లడించారు. ఎలా చేస్తే ఉత్పత్తి రంగం మరింత ప్రగతి సాధిస్తుందో వివరించారు.
ప్రస్తుతం యుగంలో అన్నీ డిజిటలైజేషన్ అయిపోయాయి. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ డిజిటలైజేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఉత్పత్తి రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఇలాంటి తరుణంలో పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తున్నమన్నారు.
అందులో భాగంగానే నిరంతరం నాణ్యమైన విద్యుత్ ను పరిశ్రమలకు ఇచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వనరులను ఉపయోగించుకుని పారిశ్రామిక రంగాన్ని ఎలా పునర్నిర్మించాలో వివరించారు. విశ్వసనీయత అనే దానికి విలువను పెంచడం వల్ల పారిశ్రమిక విప్లవాన్ని సాధించవచ్చన్నారు. దీంతో పాటు ప్లెక్ సిబిలిటీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు.
పని గంటలు, ఉత్పత్తి, నాణ్యత ఇలా అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించడం వల్ల మరింత పురోగతి సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నమ్మకాన్ని, వెసులుబాటును కల్పించడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.