19-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 19: అయోధ్యలోని రామాలయ స్మారక పోస్టల్ స్టాంపు, రాముడి స్మారక పోస్టల్ స్టాంపు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపులకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్మారక స్టాంపు, ఈ పుస్తకం శ్రీరామ జన్మభూమి ఆలయంలో జీవ ప్రతిష్టాపన ఈ పవిత్ర సందర్భాన్ని రాబోయే తరాలకు గుర్తు చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను అని మోదీ వ్యాఖ్యానించారు.
ఇదే క్రమంలో కొత్తగా 500 నోటును తీసుకుని వస్తారని ప్రచారం సాగుతోంది. రామరాజ్యం వచ్చేస్తోంది.. అయోధ్యలో శ్రీ రాములోరు పరిపాలన ప్రారంభం కాబోతున్నది. దేశం మొత్తం ఇప్పుడు రాములోరి గురించే మాట్లాడుకుంటుంది.. ఆ రోజు అంటే జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రాణ ప్రతిష్టతో దేశంలోని రామ భక్తులు అందరికీ పండుగ..
అలాంటి రోజు మరో అద్భుతాన్ని కూడా మన ప్రధాని మోదీ ఆవిష్కరించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.. రాముడి చిత్రంతో ఉన్న కొత్త 500 రూపాయల నోట్లు.. ఇప్పటి వరకు గాంధీ బొమ్మ ఉన్న స్థానంలో.. శ్రీరామ చంద్రుడితో బొమ్మతో ఉన్న కొత్త 500 రూపాయల నోట్లను.. ఆ రోజు అంటే జనవరి 22వ తేదీ మధ్యాహ్నం విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.. కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలు నిజమే అన్నట్లు.. చాలా మంది భావించటం విశేషం.. చాలా ఇళ్లలో ఈ విషయంపై చర్చ జరగటం మరో విశేషం.. అయితే దీనిని ఎవరు కూడా ఖండించడం లేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఈ వార్తలను ఖండించింది.. రాముడు బొమ్మతో ఉన్న 500 రూపాయల నోట్ల ఫొటోలను షేర్ చేయొద్దని కోరుతుంది. అలాంటిది ఏమీ జరగటం లేదని.. 500 రూపాయల నోట్లపై గాంధీ బొమ్మను తొలగించటం లేదని స్పష్టం చేస్తూనే.. రాములోరి బొమ్మతో కొత్త 500 రూపాయల నోట్లను అస్సలు విడుదల చేయటం లేదని వివరణ ఇచ్చింది.
జనవరి 22వ తేదీన ఎలాంటి కొత్త నోట్లు విడుదల కావటం లేదు.. జనం ఎవరూ ఆందోళన పడొద్దు.. ఒకవేళ రాములోరి బొమ్మతో మీ దగ్గరకు ఏమైనా డబ్బుల నోట్లు వస్తే.. అవి కచ్చితంగా నకిలీ నోట్లు అని తెలుసుకోండి.. అలాంటి నోట్లను ఇస్తున్న వాళ్లను పోలీసులకు పట్టించండి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. స్పష్టం చేస్తుంది.