20-01-2024 RJ
జాతీయం
నాసిక్, జనవరి 20: రామమందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం మహారాష్ట్రలోని అమరావతి నుంచి అయోధ్యకు 300 కిలోల కుంకుమ పత్రాలను పంపిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువులు రాజేశ్వర్ మౌళి, జితేంద్రనాథ్ మహరాజ్లు ఈ పత్రాలను అయోధ్యకు తీసుకెళుతున్నారు. వారు అయోధ్యకు బయలుదేరడాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎంపి నవనీత్ రాణా హాజరయ్యారు. భారత దేశంలో కుంకుమ పత్రాలకు సామాజిక, మతపరమైన ప్రాధాన్యత ఎంతో ఉంది.