20-01-2024 RJ
జాతీయం
పుదుచ్చేరి, జనవరి 20: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ నెల 22న పుదుచ్చేరికి సెలవు ప్రకటిస్తూ సీఎం ఎన్.రంగస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెలవు ప్రకటించింది.
అలాగే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వాలు 22వ తేది సెలవురోజుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, సీఎం కూడా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని టీవీ ఛానళ్లలో వీక్షించేలా రాష్ట్రప్రజలకు అవకాశం కల్పిస్తూ సెలవు దినంగా ప్రకటించారు.