20-01-2024 RJ
జాతీయం
చెన్నై, జనవరి 20: ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో పలు ఆలయాలను సందర్శించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రధాని మోదీ పర్యటనలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనవరి 22న అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆశీర్వాదానికి వచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం అక్కడే ఉన్న ఆండాళ్ అనే గజరాజుకి ప్రధాని మేత తినిపించారు. అనంతరం గజరాజు ప్రధానిని ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని మోదీకి దేవుడి ఆశీర్వాదం లభించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కంబరామాయణం శ్లోకాలను విన్నారు. అనంతరం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.