ad1
ad1
Card image cap
Tags  

  22-01-2024       RJ

'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే'

జాతీయం

అయోధ్య, జనవరి 22: అదిగదిగో అయోధ్యాపురి.. రఘుకుల తిలకుడు ఏలిన నగరం.. జగదభిరాముడి జన్మస్థలం.. భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో.. యావత్ భారతం.. పులకించిపోయింది. ప్రపంచం యావత్తూ వీక్షించి తరించింది. శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ పూజలో భాగంగా రామయ్యకు హారతి పట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. 500 ఏళ్ల తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్య ఆలయంలో కొలువుదీరారు.

బాల రాముడి రూపంలో వజ్ర వైఢూర్యాలతో నిండు అలంకరణలో సుందర రూపుడై నిల్చుని ఉన్నారు. నిండు అలంకరణలో బాల రాముడిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. సుందర రూపుతో, చిరు దరహాసం చిందిస్తూ మనోహరంగా ఆ శ్రీరామచంద్రుడు నిలుచుని ఉన్నారు. మనోహర రూపంతో కొలువుతీరిన రాములోరి పాదాల చెంత పద్మాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ప్రాణప్రతిష్ఠాపన చేశారు.

అభిజిత్ ముహూర్తంలో వేద పండితులు బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన చేశారు. అయోధ్య లో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది.

ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో గగనవీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ క్రతువుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందు పుజాసామాగ్రితో ఆలయంలోకి ప్రవేశిస్తోన్న వీడియోను మోదీ షేర్ చేశారు. 'ఈ దివ్యవేడుకలో భాగమైనందుకు నాకు అంతులేని ఆనందంగా ఉంది' అని ఉద్వేగానికి గురయ్యారు.

ఇకపోతే రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. యావత్ భారతదేశం మొత్తం నేడు రామనామ స్మరణతో మార్మోగింది.

వందల ఏళ్లనాటి కోట్లాది మంది హిందువుల కల నెరవేర సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలంతా భక్తిభావంతో ప్రారంభ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రపంచం నలు మూలల ఉన్న భారతీయవులు, హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఆవిష్కృతం కావడంతో పులకరించిపోయారు.

బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట జరుగుతోన్న శుభ తరుణాన్ని పురస్కరించుకొని దేశమంతా రామ నామంతో మార్మోగింది. జగభిరాముడిని కొలువు తీర్చేందుకు అయోధ్య ముస్తాబైంది. ఆలయంలో ప్రతి మూల, దీపాలు, పూలతో సర్వాంగసుందరంగా అలంకరించబడ్డాయి. యోధ్య వేడుకల్లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు అయోధ్య బాట పడుతున్నారు. ఈ మహోన్నత క్రతువు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ప్రధాని మోదీకి ఓ లేఖను రాశారు. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఈ లేఖను రాశారు. లేఖను ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కొలకొందని, ఇది భారతదేశం ఆత్మను ప్రతిబింభిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

శ్రీ రాముడు అందించిన ధైర్యం, ఏకాగ్రత, కరుణ వంటి గుణాలు ఈ ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి లేఖలో పేర్కొంటూ మనుషుల సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిని ప్రేమ, గౌరవంతో చూడాలని ప్రభు శ్రీరామ గొప్ప సందేశాన్ని అందించారని పేర్కొన్నారు. న్యాయ పరిపాలన, ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, ఇది ప్రస్తుతం మన దేశ పరిపాలనలో కనిపిస్తోందని రాష్ట్రపతి ముర్ము అభిప్రాయపడ్డారు. అలాగే నరేంద్ర మోదీ చేపట్టిన అనుష్టానం గురించి ప్రస్తావించారు.

ప్రధాని చేపట్టిన 11 రోజుల అనుష్ఠానం ఒక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదని, శ్రీరామునికి త్యాగం, సమర్పణకు ప్రతీక అని రాష్ట్రపతి లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో రాముడి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. రాముడు భారతదేశ సాంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం. ఆయన చేసిన పనులు ఆదర్శప్రాయం అంటూ చెడుపై మంచి నిత్యం యుద్ధం చేస్తుందని, విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అలాగే చీకటిలో ఉన్నప్పుడు రామ నామం వెలుగు చూపిందని, ఆ నామం తనను రక్షించిందని, ఇప్పటికీ తనను కాపాడుతోందని రాముడి గురించి మహాత్మా గాంధీ చెప్పిన అంశాలను ఆమె ఉటంకించారు.

దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడి జీవితం, ఆలయ ప్రాణ ప్రతిష్టను జరుపుకునేలా వివిధ ప్రాంతాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి. సుదీర్ఘ స్వప్నం సాకారం కాబోతోండడంతో కోట్లాది కళ్లు ఆమహాఘట్టం కోసం వేచిచూసాయి. టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు, ఇక టాలీవుడ్ తరపున మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ హీరో రామ్ చరణ్ అయోధ్య తదితరులు శ్రీ రాముణ్ణి వీక్షించారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP