22-01-2024 RJ
జాతీయం
అయోధ్య, జనవరి 22: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. 'జై శ్రీరామ్' నినాదాలతో అక్కడి వీధులన్నీ మార్మోగాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రామ మందిరం వద్దకు చేరుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రముఖ సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సచిన్ తెందూల్కర్, అనిలుంబ్లే, జాకీ ష్రఫ్, రామ్వ్ బాబా తదితరులు వచ్చారు.
'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అక్కడికి చేరుకున్నారు. మరోవైపు అయోధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామాయణ ఘట్టాలను వివరిస్తూ పలువురు గాయకులు గీతాలను ఆలపిస్తున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.