23-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897న జన్మించారు. 1897లో, భారతదేశంలో ఒడిషాలోని కటక్ అనే పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాధ్ సుభాష్ చంద్రబోస్ లాయరు. తల్లి పేరు ప్రభావతి దేవి. సుభాష్ చంద్రబోస్ విద్యాభ్యాసం కటక్ లోని రావెన్ష కాలేజియేట్ స్కూల్ లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజిలోను, ఫిల్జ్ విలియమ్ కాలేజిలోను, ఆపై చైతన్య యూనివర్సిటీ ఉఐ యూనివర్సిటీలోను సాగింది. 1920 సంవత్సరంలో భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలో నాలుగవ ర్యాంకు సాధించాడు.
ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు వచ్చాయి. అయినా 1921 ఏప్రిల్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి యువజన విభాగంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఏటా జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకొని, కేంద్రం పరాక్రమ్ దివన్ నిర్వహిస్తున్నది. బోన్ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ఒక వైపు గాంధిజీ, నెహ్రు మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సాధించవచ్చు అని నమ్మి పోరాటం సాగిస్తుంటే, తాను మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడు.
సుభాష్ చంద్రబోస్ మరణంపై పలువురు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గాంధీతో సిద్దాంత పరమైన అభిప్రాయ బేధాలు ఉండటం వలన భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికైనా ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్య్ర సాధనకు నరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ భావన. స్వంతంగా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులు బోన్ని జైలులో బంధించారు.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి ఇది ఒక సువర్ణావకాశంగా భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మన్, జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.
సుభాష్ చంద్రబోస్ రాజకీయ అభిప్రాయాలు, జర్మని మరియు జపాన్తో అతని మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా సుభాష్ చంద్ర బోస్ ను అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్వదమైంది.
1945 ఆగస్ట్ 18లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడని ప్రకటించినప్పటికి, సుభాష్ చంద్రబోస్ ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం.. కార్యక్రమాలు చేపట్టారు. స్వాతంత సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఘనంగా నివాళులర్పించారు.