23-01-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జనవరి 23: బీహార్ దివంగత మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. వెనుకబడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ.. ఆయన శతజయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించారు. జననాయక్ కు ప్రజలకు కర్పూరీ ఠాకూర్ సుపరిచితుడు. రెండుసార్లు బీహార్ సీఎంగా పనిచేశారు ఠాకూర్.
జనతా పార్టీ తరపున 1970 డిసెంబర్ నుంచి 6 నెలలు, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు బీహార్ సీఎంగా ఉన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేశారు. విద్యార్థిగా క్విట్ ఇండియా, స్వాతంత్య ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. కర్పూరీ ఠాకూర్ 1924 జనవరి 24న జన్మించారు. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. మరణానంతరం భారతరత్న వరించింది.