01-02-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: భారతదేశ వృద్ధిని పెంచడానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్ర బడ్జెట్ లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు.
బడ్జెట్ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షల కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు.
ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు. బడ్జెట్ లో వివిద శాఖలు..
పథకాలకు కేటాయింపులు పై విధంగా ఉన్నాయి.