01-02-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయ పన్ను వర్గాలకు నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ లో ఉపశమనం కలిగించే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈసారి కూడా కొనసాగుతుందని, రూ.7 లక్షల వరకూ ఎలాంటి పన్ను భారం ఉండదని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష, దిగుమతి సుంకాలకు పాత పన్ను విధానమే కొనసాగుతుందని తెలిపారు.
గత పదేళ్లుగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగింది. రిటర్న్ 2.4 రెట్లు పెరిగాయి. పన్ను చెల్లింపుదారుల వాటాను దేశ సంక్షేమం, ప్రజల సంక్షేమానికి తెలివిగా ఖర్చుచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. పన్ను చెల్లింపుదారులు ఇస్తున్న సపోర్ట్ కు అభినందిస్తున్నాను. ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధం చేసింది. కొత్త పన్నుల పథకం కింద, రూ.7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు.
అంతకు మించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. గత ఏడాది ప్రతిపాదిత పాత పన్ను విధనంలో ఆదాయ పరిమితి రూ.2.50,000 గానే ఉంటుంది. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదు. ప్రస్తుతం ఉన్న దేశవాళి కంపెనీల కార్పొరేట్ టాక్స్ రేటు 30 శాతం నుంచి 22 శాతం తగ్గించాం. నిర్దిష్టమైన కొత్త మ్యాన్యు ఫ్యాక్టరింగ్ కంపెనీలకు పన్ను రేటు 15 శాతం చేశాం' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.