01-02-2024 RJ
జాతీయం
రాంచీ, ఫిబ్రవరి 1: జార్ఖండ్ ను కుదిపేస్తున్న భూ ఆక్రమణల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు రాంచీలోని పీఎంఎస్ఏ కోర్టు ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పది రోజుల పాటు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ, ఒక రోజు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశాలిచ్చింది.
మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు 6 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం హేమంత్ సోరెన్ తన రాజీనామాను గవర్నర్ కు బుధవారం రాత్రి సమర్పించారు. ఆ కొద్దిసేపటికే ఈడీ ఆయనను అరెస్టు చేసింది. పీఎంఎల్ఎ కోర్టు ముందు గురువారం ఉదయం హాజరుప రిచింది. రోవైపు, మనీలాండరింగ్ కేసు కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.