ad1
ad1
Card image cap
Tags  

  03-02-2024       RJ

భాజాపా అగ్రనేత అద్వానీకి భారతరత్న

జాతీయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: రాజకీయ కురువృద్ధుడు, భాజపా అగ్రనేత ఎల్.కె. అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం 'ఎక్స్ (ట్విటర్' వేదికగా వెల్లడించారు. వాజ్పేయి తరవాత భారతరత్న అందుకున్న నేతగా అద్వానీ గౌరవం దక్కించుకున్నారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ పాత్ర కీలకమని కొనియాడారు. ‘అద్వానీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నాం.

ఆయనతో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి.. ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. పార్లమెంట్లో ఆయన అనుభవం మనకు ఎన్నటికీ ఆదర్శప్రాయం. అద్వానీజీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది.

ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా' అని ప్రధాని రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. 'భారతరత్న గౌరవం అందుకోబోతున్న ఎల్కే అద్వానీతో నేను మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు.

దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. అద్వానీ జీవితంలో క్షేత్రస్థాయిలో పని చేయడం మొదలుపెట్టి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఎదిగారు. మన హోంమంత్రిగా కూడా సేవలు అందించారు. పార్లమెంట్లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయ మైనవి, గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయి' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఎలెకే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తనకు చాలా భావోద్వేగభరితమైన క్షణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎల్కే అద్వానీతో ఉన్న రెండు ఫొటోలను ప్రధాని షేర్ చేశారు. అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పారదర్శకత, సమగ్రతతో సేవలు అందించారని కొనియాడారు. తిరుగులేని నిబద్ధత, రాజకీయ నైతికతలతో ఆదర్శప్రాయమైన ప్రమాణాలను నెలకొల్పారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఆయన అసమానమైన కృషి చేశారని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో మాట్లాడి, ఆయ నుంచి పాఠాలు నేర్చుకోవడానికి తనకు లెక్కలేనన్ని అవకాశాలు లభించడం ఎల్లప్పుడు గొప్ప అదృష్టంగా భావిస్తానని మోదీ చెప్పారు. అద్వానీకి ముందు ఇటీవలే కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ప్రకటించారు. బిజెపి అగ్రనేత వాజ్పేయ్ కి కూడా భారతరత్న ప్రకటించారు.

ఇకపోతే ఎల్కే అద్వానీ బీజేపీకి అత్యధికకాలం అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత వహించారు. 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. ఇక అటల్ బిహారీ వాజ్పేయి సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన 90వ దశకంలో బీజేపీ ఎదుగుదల కోసం ఎలెకే అద్వానీ విశేష కృషి చేశారు. 2002-04 వరకు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారు.

అడ్వాణీ పూర్తి పేరు లాల్ కృష్ణ అడ్వాణీ. 1927 నవంబరు 8న అవిభక్త భారత్ లోని కరాచీ లో జన్మించారు. అక్కడే సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. పాక్ లోని హైదరాబాద్ లో గల డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను పూర్తి చేశారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

దేశ విభజన తర్వాత భారత్ కు వలస వచ్చిన అడ్వాణీ.. రాజస్థాన్ లో సంఘ్ ప్రచారక్ గా పనిచేశారు. 1957లో దిల్లీకి వెళ్లి జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలిచారు. 1970-72లో భారతీయ జనసంఘ్ దిల్లీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.

1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలవడంతో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘన్ ను వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు.

1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి భాజపా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి అడ్వాణీ గెలిచారు. 2004 ఎన్నికల్లో భాజపా ఓటమిపాలవ్వడంతో అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు.

లోక్ సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిగా పోటీచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీ నగర్ నుంచి గెలుపొందిన అడ్వాణీ.. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అద్వానీకి భారతరత్న ప్రకటనతో బిజెపి శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిసాయి.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP