ad1
ad1
Card image cap
Tags  

  06-05-2024       RJ

నేడు మూడోదశ ఎన్నికలు.. భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం

జాతీయం

న్యూఢల్లీి, మే 6: దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్టాల్రు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్‌ స్థానాలకు మంగళవారం మే7న పోలింగ్‌ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. మూడో దశలో అసోంలో నాలుగు, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌గఢ్‌లో ఏడు, గోవాలో రెండు, గుజరాత్‌లో 26, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్‌లో 4 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ఒకటి, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలో రెండు స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. మూడో దశలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కాంగ్రెస్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌, ఎన్సీపీ (ఎస్పీ) నేత, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భార్య డిరపుల్‌ యాదవ్‌, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు రెండు దశల్లో పోలింగ్‌ ముగిసింది. 

ఏప్రిల్‌ 19న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 66.14 శాతం, ఏప్రిల్‌ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం ఓటింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. అస్సాంలోని  ధుబ్రి, కోక్రారaర్‌, బార్పేట, గౌహతి, బీహార్‌లోని  రaంజర్‌పూర్‌, సుపాల్‌, అరారియా, మాధేపురా, ఖగారియా, ఛత్తీస్‌గఢ్‌: జంజ్‌గిర్‌-చంపా, కోర్బా, సుర్గుజా, రాయ్‌ఘర్‌, బిలాస్‌పూర్‌, దుర్గ్‌, రాయ్‌పూర్‌, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ,గోవా: ఉత్తర గోవా, దక్షిణ గోవా, గుజరాత్‌: కచ్‌, బనస్కాంత, పటాన్‌, మహేసన, సబర్కాంత, గాంధీనగర్‌, అహ్మదాబాద్‌ ఈస్ట్‌, అహ్మదాబాద్‌ వెస్ట్‌, సురేంద్రనగర్‌, రాజ్‌కోట్‌, పోర్‌ బందర్‌, జామ్‌నగర్‌, జునాగఢ్‌, అమ్రేలి, భావ్‌నగర్‌, ఆనంద్‌, ఖేడా, పంచమహల్‌, దాహోద్‌, వడోదర, ఛోటా ఉదయపూర్‌, భరూచ్‌, బర్దోలీ, నవ్సారి, వల్సాద్‌, కర్ణాటక: చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్‌, బీజాపూర్‌, గుల్బర్గా, రాయచూర్‌, బీదర్‌, కొప్పల్‌, బళ్లారి, హవేరి, ధార్వాడ్‌, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా, మధ్యప్రదేశ్‌: గుణ, సాగర్‌, విదిష, మోరెనా, భింద్‌, గ్వాలియర్‌, భోపాల్‌, రాజ్‌గఢ్‌, బేతుల్‌,మహారాష్ట్ర: బారామతి, రాయగడ, ధరాశివ్‌, లాతూర్‌, షోలాపూర్‌, మాధా, సాంగ్లీ, రత్నగిరి-సింధుదుర్గ్‌, కొల్హాపూర్‌, హత్కనాంగ్లే, ఉత్తరప్రదేశ్‌: సంభాల్‌, హత్రాస్‌, ఆగ్రా ఫతేపూర్‌ సిక్రి, ఫిరోజాబాద్‌, మెయిన్‌పురి, ఎటా, బదౌన్‌, అంబాలా, బరేలీ.,పశ్చిమ బెంగాల్‌: మాల్దా సౌత్‌, జంగీపూర్‌, మాల్దా నార్త్‌, ముర్షిదాబాద్‌ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరుగనుంది. 

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP