13-05-2024 RJ
జాతీయం
కోల్‌కతా, మే 13: కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని కాషాయ కూటమిని మట్టికరిపించి విపక్ష ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి బీజేపీని నిలువరించేలా తాము బెంగాల్ నుంచే కూటమికి సాయం చేస్తామని చెప్పారు. తనకు అందిన సమాచారం ప్రకారం ఎన్డీయే కేవలం 190 నుంచి 195 స్ధానాలకే పరిమితమవుతుందని, విపక్ష ఇండియా కూటమి 315 స్ధానాల్లో గెలుపొందుతుందని అన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బన్గావ్‌లో దీదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మోదీ సర్కార్‌కు భంగపాటు తప్పదని ఆమె పేర్కొన్నారు. విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని దీదీ ఆశాభావం వ్యక్తం చేశారు.