17-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 17: బిజెపిని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా అక్కడి నేతలు ఇంతకాలం చేసిన రాజకీయ డ్రామాలకు తెరపడడం లేదు. ఎందుకంటే 370 ముసుగులో రాచరికం అనుభవించిన నేతలు ఇప్పుడు అక్కడ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడం జీర్ణించుకోవడం లేదు. అందరు కాకున్నా కొందరికి ఈ చర్య గిట్టుబాటు కాని వ్వయహారంగా కూడా ఉంది. అలాగే ఏకపక్ష రాజకీయం లేకుండా చేసింది. కేంద్రం తీసుకుంటున్న శాంతి చర్యలకు ఇంతకాలం మెహబూబా ముఫ్తీ కూడా గండికొట్టారు. పూర్తి పాక్ అనుకూల విధానాలను నరనరాన జీర్ణించుకున్న హురియత్ నేతలు కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం చేసిన యత్నాలను ఆదినుంచీ గండికొట్టారు. అక్కడ 370 ఆర్టికల్‌ను అడ్డం పెట్టుకుని ఇంతకాలం హురియత్ నేతలకు తోడు మెహబూబా ముఫ్తీ, అబ్దుల్లాలు పాక్‌తో కలసి దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ వచ్చారు.
ప్రజలను రెచ్చగొడుతూ యువతను పక్కదారి పట్టించారు. అక్కడి ముఫ్తీలు,అబ్దుల్లాలే ఒక్కరే కాశ్మీర్ ప్రజలు కాదని గుర్తుంచు కోవాలి. 370 రద్దుతో హురియత్ నేతలకు స్థానం లేకుండ పోయింది. అలాగే అక్కడి నుంచి తరిమివేయబడ్డ వేలాది కాశ్మీర్ పండిట్లతో కూడా సమస్యలు చర్చించడం ద్వారా వారిలో ధైర్యం కల్పించాలి. కాశ్మీర్‌లో అసలు జరుగుతున్నదేమిటో ప్రపంచానికి తెలిసింది. నిజానికి పండిరట్లను ముందుగా వారిని తమ స్వస్థలాలకు పంపి రక్షణ కల్పించాలి. కనీస మర్యాద, గౌరవం లేకుండా తామేదో ఇతర దేశస్థుల మాదిరిగా ఇంతకాలం నేతలు వ్యవహరిస్తూ వచ్చారు. ఇంతకాలం వారి పెడధోరణికి నిదర్శనంగా గుర్తుంచుకోవాలి. విచ్ఛిన్నకర ధోరణితో కాశ్మీర్‌లో మరింత ఆజ్యం పోస్తూ వచ్చారు.
వారంతా కావాలని పాక్ కొమ్ముకాస్తూ భారత్‌లో వేర్పాటు వాద కార్యకలాపాలకు మద్దతు పలికారు. వీరంతా తాము అనుకున్న రీతిలో కాశ్మీర్ నడవాలని అనుకున్నారు. పాక్ వీరికి భారత్ వ్యతిరేక ఉగ్రవాదాన్ని నూరిపోస్తోంది. 370 ఆర్టికల్ కాశ్మీర్ అభివృద్దికి అడ్డుగా నిలవడమే గాకుండా కాశ్మీరీ పండిరట్లకు చోటులేకుండా చేసింది. దీనిరద్దుతో ఇప్పుడు పండిట్లు తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం వచ్చింది. అలాగే మెల్లగా ఇక్కడినుంచి తరలి వెళ్లిన వారు కూడా వచ్చేస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని ఉగగ్రమూకలు పండిట్లను మళ్లీ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు. ముందు పండిట్లను కాశ్మీర్‌లో స్వేఛ్చగా జీవించే చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే కాశ్మీర్ అందరిదన్న భావన ఉంటుంది. కాశ్మీరీ పండిట్లను జాడ లేకుండా తరిమేసినా గత ప్రభుత్వాలు ఏనాడూ అక్కడ నివారణ చర్యలు తీసుకుని అక్కడి ప్రజలను భారత్‌తో మమేకం చేయలేకపోయింది.
రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వచ్చాయి. బిజెపి కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరిం చడంలో చొరవ తీసుకున్న దానిని విఫలం చేశారు. పాక్ పాలకులతో స్నేహం పెంచుకోవడం ద్వారా తీవ్రవాద గ్రూపులు కాశ్మీర్‌ను నిత్యం కల్లోల క్షేత్రంగా రగిలిస్తూనే ఉన్నారు. అందువల్ల ముందుగా కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డ పండిట్లను ఇతర ప్రాంత ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అలా చికిత్సకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే మిగతా వర్గాల ప్రజలు కూడా విశ్వాసంలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కొంత కఠిన వైఖరినే కేంద్రం అవలంబించాలి. ఇక్కడ శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఇక్కడ తీవ్రవాదులు ఎగదోస్తూ చిచ్చు రేపుతున్నారు. రాజకీయ లబ్ధికి వీటిని ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా వ్యూహాలు ఉండాలి. నరేంద్రమోదీ ప్రభుత్వం కాశ్మీర్ సమస్య, కాశ్మీర్ పట్ల వివేకవంతమైన వైఖరితో ముందుకు వెళ్లడం స్వాగతించాలి.
ప్రధాని మోడీ ప్రయత్నాలు ఫలించాలంటే ప్రతిపక్షం కూడా ఆయనకు బాసటగా ఉండాలి. అయితే పక్కలో బల్లెంలా ఉన్న పాక్ పాలకులు కాశ్మీర్‌లో ఆజ్యం పోస్తూ ఉగ్రవాదులను ఎగదోస్తున్నారు. భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలు ఈ నాటివి కాదు. భారత్ నుంచి విడివడ్డ నాటి నుంచి అంటే 1947 నుంచి కుట్రలు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి తీవ్రవాదులను దేశం దాటించాలని అక్కడి సైన్యం చూస్తోంది. సరిహద్దుల్లో తీవ్రవాదలును చొప్పించేందుకు సిద్దంగా ఉన్న పాక్ సైన్యం కాల్పుల ద్వారా తరచూ దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దులో పాకిస్థాన్ పదేపదే కాల్పులకు తెగబడుతున్న తీరు దాని కుత్సిత బుద్దికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
పాక్‌కు మాటలతో సమాధానం చెప్పలేమని గతానుభవాలను బట్టి తెలుసుకోవాలి. పాక్‌లో అంతర్గ సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఇలా భార్‌తపైకి దాడులకు దిగుతారు. పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొట్టేందుకే కాశ్మీర్ విషయంలో ఎప్పుడూ వివాదం సృష్టిస్తూనే ఉంటారు. ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ ఈ సమస్య రాజుకుంటూనే ఉంది. దౌత్య పరంగా తప్పటడుగుల వేయడంతో భారత్‌కు తిప్పలు తప్పలేదు. ఇప్పటికైనా మోడీ దీని పరిష్కారాన్ని చేతల్లోకి తీసుకోవడం ద్వారా శాశ్వత పరిష్కారానికి తెగువ చూపారు.