17-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 17: ప్రతిపక్ష నేతల ప్రసంగాల్లోని పదాలను దూరదర్శన్, ఆకాశవాణిలు తొలగించాయి. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు జి.దేవరాజన్ ప్రసంగాల్లోని కొన్ని పదాలను ఇవి తొలగించాయి. ’మత నియంతృత్వం, క్రూరమైన చట్టాలు, ముస్లింలు’ వంటి పదాలను వారి ప్రసంగాల నుండి తీసివేశారు. ఢిల్లీలోని దూరదర్శన్ స్టూడియోలో సీతారాం ఏచూరి ఇచ్చిన టెలివిజన్ ప్రసంగం నుండి రెండు పదాలను తొలగించగా, ’దివాలా’ ప్రభుత్వం పదాన్ని ’వైఫల్య’ ప్రభుత్వంగా మార్చారు. కాగా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు జి.దేవరాజన్ ప్రసంగంలో నుండి ’ముస్లింలు’ అనే పదాన్ని తొలగించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో కేటాయించిన ప్రసార సమయంలో చేసిన ప్రసంగాలలో ఈ చర్య తీసుకోబడిరది. అదే సమయంలో ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఇంతకుముందు కూడా ఇలాంటి చర్యలు చేపట్టామని ప్రసార భారతి అధికారులు వివరించారు. ఈ చర్యపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.