17-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 17: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సీఎం అరవింద్ కేజీవ్రాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేసిన ఘటన సంచనలంగా మారింది. నిన్న ఆమె ఢిల్లీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నిందితుడిపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ నివేదిక ప్రకారం.. స్వాతి మలివాల్ 7`8 సార్లు కొట్టడంతో పాటు ఛాతీ, కడుపు భాగంలో తన్నడంతో పాటు సన్నితమైన శరీర భాగాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే కేజీవ్రాల్ నివాసంలో భద్రతా సిబ్బందితో స్వాతి మలివాల్‌కి జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గార్డులకు స్వాతి మలివాల్ వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు. ‘తేరీ భీ నౌక్రీ ఖావుంగీ? యే గంజా సాలా‘ అని ఆమె చెప్పినట్లు వినవచ్చు.
భద్రతా సిబ్బంది ఆమెను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాను పోలీసులకు ఫోన్ చేస్తానని స్వాతి మలివాల్ చెప్పడం వినొచ్చు. పోలీసులకు ఇక్కడి రారని భద్రతా సిబ్బంది చెప్పడం కనిపిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోపై మలివాల్ స్పందిస్తూ.. ‘తనను తాను రక్షించుకోవడానికి ‘రాజకీయ హిట్‌మ్యాన్‘ ప్రయత్నాలు ప్రారంభించారు. తన వ్యక్తులను ట్వీట్ చేయడం, సగం సందర్భం లేని వీడియోలను అమలు చేయడం ద్వారా అతను నేరం చేసిన తర్వాత తప్పించుకోగలనని అతను భావిస్తున్నాడు. ఒకరిని కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు..? ఒక్కసారి ఇంటిలోపల సీసీటీవీ ఫుటేజీ చూస్తే అందరికి నిజం తెలుస్తుంది‘ అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.