ad1
ad1
Card image cap
Tags  

  18-05-2024       RJ

రాయబరేలీ, అమేథీలు గాంధీ కుటుంబంతో విడదీయలేనివి

జాతీయం

  • ఎన్నికల ప్రచారం కోసమే పోటీకి దూరం
  • ఇక్కడి ప్రజలతో మాకు నిరంతర సంబంధాలు 
  • ఓటమి భయంతో తప్పుకున్నారన్న విమర్శలకు కౌంటర్‌
  • మోడీ భయంతోనే వదోదర వదిలి పెట్టారా అని ఎదురు ప్రశ్న
  • మీడియా సమావేశంలో ప్రియాంక సూటిగా సమాధానాలు

న్యూఢిల్లీ, మే 18: ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంపైనే తాను ప్రధానంగా దృష్టి కేంద్రీకరించానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. అందువల్లే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను, సోదరుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల బరిలో దిగితే బీజేపీ లాభ పడుతుందని అభిప్రాయపడ్డారు అయితే అమేఠీ, రాయ్‌బరేలీని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ వదులుకోదని ఈ సందర్బంగా ప్రియాంక పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో ప్రియాంక గాంధీ విూడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా విూరు.. ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదంటూ అడిగిన ప్రశ్నకు ప్రియాంక గాంధీ పైవిధంగా సమాధానమిచ్చారు.

గత పక్షం రోజులుగా రాయ్‌బరేలీలో తాను ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అలాగే రాయ్‌బరేలీతో గాంధీ ప్యామిలీకి గతం నుంచి సంబంధాలు ఉన్నాయని.. అవి కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాము రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించకపోయినా.. తాము ఇక్కడికి వస్తామని.., ప్రజలను కలుస్తామని.. వారితో మమేకమవుతాని ఈ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం తమపై అంత నమ్మకముందన్నారు. కేరళలోని వాయ్‌నాడ్‌ నుంచే కాకుండా గాంధీ ఫ్యామిలీకి కంచుకోట రాయ్‌బరేలీ నుంచి సైతం రాహుల్‌ గాంధీ ఎన్నికల బరిలో నిలిచారని ఈ సందర్బంగా ప్రియాంక గుర్తు చేశారు.

రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి తన తల్లి సోనియాగాంధీ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. అయితే ఈ ఏడాది తొలినాళ్లలో ఆమె రాజ్యసభకు వెళ్లారని వివరించారు. తాను రాయ్‌బరేలీలో, రాహుల్‌ అమేఠీలో 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే.. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారాన్ని ఎవరు నిర్వహిస్తారని ప్రియాంక ఈ సందర్బంగా ప్రశ్నించారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడంపైన కానీ.. పార్లమెంటేరియన్‌ కావడంపై కానీ ఆలోచన లేదన్నారు. కానీ పార్టీ తనకు ఏ పని చేయమంటే.. ఆ పని చేసేందుకు తాను సిద్దమని ప్రియాంక గాంధీ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే.. అ క్రమంలో ఎన్నికల బరిలో దిగుతానని ప్రియాంక స్పష్టం చేశారు. మరోవైపు ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని.. అందుకే ఆమె ఎన్నికల బరిలో దిగలేదంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఈ సందర్బంగా ఆమె ఖండిరచారు. కాంగ్రెస్‌ పార్టీ ఏమి బీజేపీ చెప్పినట్లు నడుచుకోవడం లేదని.. బీజేపీ విమర్శలను ఖండిరచారు. ఇక అమేఠీని రాహుల్‌ గాంధీ వదిలి.. రాయ్‌ బరేలీని ఎంచుకోవడంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ప్రియాంక తిప్పికొట్టారు.

2014లో ప్రధాని మోదీ గుజరాత్‌లోని వడోదరలో పోటీ చేశారని గుర్తు చేశారు. అనంతరం ఆయన వారణాసి నుంచే ఎన్నికల బరిలో నిలుస్తున్నారని తెలిపారు. అంటే మోదీ వడోదరను భయంతో వదిలివేశారా?అని ప్రియాంక ప్రశ్నించారు. ఇక గత ఎన్నికల్లో అమేఠీ నుంచి బరిలో దిగిన రాహుల్‌ గాంధీ.. బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలో అమేఠీలో మరోసారి రాహుల్‌ బరిలో దిగితే ఇరానీ చేతిలో ఓటమి తప్పదని భయపడ్డారని .. అందుకే రాహుల్‌ గాంధీ ఈ సారి రాయబరేలి నుంచి బరిలో దిగారంటూ బీజేపీ ఆరోపణలు సందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పైవిధంగా స్పందించారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP