20-05-2024 RJ
జాతీయం
పూరి, మే 20: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ఒడిశాలో పర్యటించిన ఆయన.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం బీజేడీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ పాలనలో దేవాలయానికి కూడా రక్షణలేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో జగన్నాథుడి ఆలయం సురక్షితంగా లేదు. గత ఆరేళ్ల నుంచి రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదు‘ అని మోదీ విమర్శించారు. కొద్దిరోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదే విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే.
కొన్నాళ్లుగా కోట్లాదిమంది పూరీ జగన్నాథ్ స్వామి భక్తులు రత్నభాండాగారం గురించే ఆలోచిస్తున్నారు. ఈ భాండాగారం తాళం చెవుల మిస్టరీని బయటపెట్టాలని కోరుకొంటున్నారు. నవీన్ పట్నాయక్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి నమ్మకాలు, విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. నకిలీ తాళాలు ఎవరు తయారుచేశారని ప్రశ్నించారు. ఆ భాండాగారంలో అప్పటి రాజులు, భక్తులు దేవతా మూర్తులకు కానుకగా సమర్పించుకున్న విలువైన ఆభరణాలు ఉన్నాయి. దీనిని 1985లో చివరిసారిగా తెరిచారు. చాలాకాలంగా దానిని తెరవనందున లోపల పరిస్థితి ఎలా ఉందన్న దానిపై స్పష్టత లేదు. దాంతో 2018 ఏప్రిల్ 4న భాండాగారం పరిశీలనకు వెళ్లిన నిపుణుల బృందం రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది. ఆ విషయం బయటకు తెలియడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
2009 నుంచి ఒడిశాలో నవీన్ పట్నాయక్ (బీజేడీ) ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవీన్ లోపాయికారీగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ బీజేడీ మద్దతిచ్చింది. దీనికి బదులుగా కేంద్రం ఆ రాష్టాన్రికి అన్నివిధాలా సహకరించింది. ప్రస్తుత ఎన్నికల్లో రెండు పార్టీలు ఒంటరిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘పూరీలో మహాప్రభు జగన్నాథుడిని ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి మమ్మల్ని పురోగతి కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని‘ తెలిపారు. పూజలు నిర్వహించిన తర్వాత.. మార్చికోట్ చౌక్ నుండి పూరీలోని మెడికల్ స్క్వేర్ వరకు రెండు కిలోవిూటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు.
బీజేపీ పూరీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్ పాత్రతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రత్న భాండార్ తాళాలు మిస్ కావడంపై అధికార బీజేడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 25 ఏళ్లుగా బిజూ జనతా దళ్ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. బీజేడీ హయాంలో పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం కూడా సురక్షితం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడ్డాక అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని వెల్లడిరచారు. గత పదేళ్లలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దేశ ప్రజలంతా చూశారన్నారు. 21వ శతాబ్దపు ఒడిశా అభివృద్ధిలో వేగం కావాలని, అది కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
గత 10 రోజుల్లో ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించడం ఇది రెండోసారి. ఒడిశాలో ఎన్నికల ముందు బీజేపీ, బీజేడీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ తర్వాత విఫలమవడంతో ఆ పార్టీల మధ్య పోరు మరింత ముదిరింది. 2009లో తమ భాగస్వామ్యాన్ని ముగించడానికి ముందు బీజేపీ`బీజేడీ తొమ్మిదేళ్ల పాటు ఒడిశాను పొత్తుతో పాలించాయి.