21-05-2024 RJ
జాతీయం
ఆగ్రా, మే 20: పేదవాడు డబ్బు సంపాదించటం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే, ఉన్నోడు మాత్రం డబ్బును ఎక్కడ దాచాలో కూడా తేలిక సతమతం అవుతున్నాడు.మాములుగా డబ్బును ఇంట్లో బీరువాలో దాచుకుంటాం, మరీ ఎక్కువ ఉంటే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. కానీ, ఇంట్లో మంచం విూద పరుపులా పరచడం ఎప్పుడైనా చూశారా. ఆగ్రాలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో చోటు చేసుకున్న ఘటన చూస్తే అవాక్కవుతారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కట్టల కొద్దీ డబ్బు బయటపడిరది.
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 60కోట్ల రూపాయల డబ్బు మంచం విూద పరుపులా పరిచి ఉండటం చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. కట్టలు కట్టలుగా బయటపడ్డ డబ్బును అధికారులు సీజ్ చేశారు. శనివారం రాత్రి ఆరు చోట్ల జరిపిన సోదాల్లో బయటపడ్డ డబ్బును కౌంట్ చేయటానికి 6 కౌంటింగ్ మిషన్లు కావాల్సి వచ్చింది అధికారులకు. ఈ సోదాల్లో 60కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నా అధికారులు.