23-05-2024 RJ
జాతీయం
ముంబై, మే 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఉదయం ప్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత దూసుకుపోయాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిప్టీ జీవనకాల గరిష్ఠాలను తాకాయి. అదే సమయంలో సెన్సెక్స్ తొలిసారిగా 74,253 పాయింట్లు, నిప్టీ 22,950 పాయింట్ల ఎగువన ముగిశాయి. కేంద్రానికి అంచనాలకు మించి రిజర్వ్ బ్యాంక్ డివిడెండ్ ప్రకటించింది. 2023`24 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 2.11లక్షల కోట్లను చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది. దాంతో సూచీలు పరుగులు తీశాయని.. అదే సమయంలో ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగుతూ వస్తున్నారు. తాజాగా దేశీయ మదుపరులతో పోలిస్తే మళ్లీ వారే కొనుగోళ్లకు కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు హెచ్‌ఎస్‌బీసీ వెలువరించిన డేటా సైతం సూచీల పరుగుకు మరో కారణమని పేర్కొంటున్నారు.
కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 74,253.53 పాయింట్ల వద్ద ఎª`లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సెన్సెక్స్ దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 75,499.91 పాయింట్లకు పెరిగి.. జీవకాల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 1,196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిప్టీ సైతం ఆల్‌టైమ్ హైకి చేరుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో ముగిసింది. చివరకు 369.85 పాయింట్లు పెరిగి.. 22,967.65 వద్ద స్థిరపడిరది. దాదాపు 1577 షేర్లు పురోగమించగా.. 1761 షేర్లు క్షీణించాయి. నిప్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, ఐచర్ మోటార్స్ లాభాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిందాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. మెటల్, ఫార్మా మినహా, ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్ క్యాపిటల్ గూడ్స్ 2శాతం చొప్పున పెరిగాయి.