ad1
ad1
Card image cap
Tags  

  24-05-2024       RJ

నిరుద్యోగ భారతంలో మరో అంకం

జాతీయం

  • కేంద్రం తీరుతో కానరాని ఉద్యోగాలు
  • ఐఐటిల్లో చదివిన వారికే ఉద్యోగాలు నిల్‌

న్యూఢిల్లీ, మే 24: దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా..అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేక పోతున్నా బిజెపిలో అంతర్మథనం జరగడం లేదు. ఎందుకిలా అవుతుందో అన్న ఆలోచన చేయడం లేదు. పట్టాలు పట్టుకుని రోడ్డెక్కుతున్న నిరుద్యోగల సంఖ్య ఏటా కోట్లకు చేరుతోంది. తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఘతన వహించిన ప్రధాని మోడీ నిరుద్యోగం గురించి మాట్లాడడం లేదు. ఐఐటిల్లో చదివి పట్టాలు పుచ్చుకున్న వారికే ఉద్యోగాలకు దిక్కులేకుండా పోయింది. ఇక మిగతా కాలేజీల్లో చదివిన వారి సంగతి ఎలా ఉంటుందో వేరుగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో విద్యా సంస్థల్లో ఐఐటిలకు ప్రత్యేక స్థానం ఉంది. ఐఐటిల్లో చదివిన వారికి మంచి ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు ఉంటాయని వింటుంటాం. కానీ, ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. దేశంలోని వివిధ ఐఐటిల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38 శాతం మందికి క్యాంపస్‌ ఉద్యోగాలు దక్కలేదు.

దేశంలో 61 శాతం పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కలేదు. ఐఐటి కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్సింగ్‌ సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటి క్యాంపస్‌ ల్లో దాదాపు 8 వేల మంది అంటే 38శాతం మందికి  ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని తేలింది. 2024లో 21,500 మంది విద్యార్థులు ఉద్యోగాలు కోసం నమోదు చేసుకోగా, కేవలం 13,400 మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు. మిగతా వారు 38 శాతం ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది. రెండేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపు అయినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పాత తొమ్మిది ఐఐటిల్లో ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, వారిలో 6,050 మందికి అంటే 37 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు.

కొత్త 14 ఐఐటిల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5,100 మంది ఉద్యోగాలు కోసం నమోదు చేసుకోగా, ఇంకా 2,040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది ఖరగ్‌పూర్‌ ఐఐటిల్లో 33 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని ధీరజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు. ఉద్యోగాలురాని విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అనిశ్చిత స్థితిని సూచిస్తుంది. దాదాపు 61 శాతం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లు ఇప్పటికీ చోటు చేసుకోలేదు. ఇది ప్రధాన కళాశాలలు, యువ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొందని ధీరజ్‌ సింగ్‌ తెలిపారు. ఐటి ఢిల్లీలో గత ఐదేళ్లలో 22 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకపోగా, 2024కు వచ్చేసరికి 40 శాతం మందికి అదే పరిస్థితి ఎదురైంది.

గత రెండేళ్లలో 600 మందికి ఉద్యోగాలు దక్కలేదు. 2022 నుంచి 2024 వరకు పాత తొమ్మిది ఐఐటిల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా, ఉద్యోగాలు సాధించనివారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. అలాగే, నూతన  ఐఐటిల్లో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగాలు దక్కని విద్యార్థుల సంఖ్య కూడా 3.8 రెట్లు పెరిగింది. ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఆరుగురు ఐఐటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, అనేక మంది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది పాలకుల నిర్లక్ష్యం, దూరదృష్టి లోపంగా చూడాలి. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడంలో మనం ఎందుకు విఫలం అవుతున్నామో అద్యయనం చేయాలి. అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలి.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP