ad1
ad1
Card image cap
Tags  

  24-05-2024       RJ

మహారాష్ట్ర ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌.. పదికి చేరిన మృతుల సంఖ్య

జాతీయం

ముంబై, మే 24: మహారాష్ట్రలోని ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. పేలుడు  ఘటన గురువారం జరిగింది. మహారాష్ట్రలోని డోంబివాలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ముదాన్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలోగురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు బాయిలర్‌ పేలడంతో పేలుడు సంభవించింది. ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం కూడా ప్రభుత్వం ప్రకటించింది. డోంబివాలి బాయిలర్‌ పేలుడు కేసుపై ఉన్నత స్థాయి విచారణకు సిఎం ఆదేశించారు.  ఘటనపై ముఖ్యమంత్రి షిండేతో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని సస్పెండ్‌ చేసినట్లు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. సంఘటనా స్థలానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, టిడిఆర్‌ఎఫ్‌ అగ్నిమాపక దళం బృందాలను రప్పించామని ఫడ్నవీస్‌ ట్వీట్‌లో రాశారు. సహాయ, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. పేలుడు శబ్దం కిలోవిూటరు దూరం వరకు వినిపించిందని తెలిపారు. పేలుడు ధాటికి సవిూపంలోని భవనాల అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. పలు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని విపత్తు నిర్వహణ శాఖ అధికారి యాసిన్‌ తద్వీ తెలిపారు. పేలుడు తర్వాత సవిూపంలోని మూడు ఫ్యాక్టరీలకు మంటలు వ్యాపించాయి. చాలా దూరం నుండి పొగ, మంటలు కనిపించాయి.
ఘటనా ప్రాంతంలో పారిశ్రామిక భద్రతా విభాగం లేదని మహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్‌ దాన్వే అన్నారు. అలాంటి కర్మాగారం నివాస ప్రాంతానికి సవిూపంలో ఉండకూడదు. ఇదే అతి పెద్ద నేరం. ఒక సాంకేతిక వ్యక్తి అక్కడ ఉండాలి. ఒక సాధారణ కార్మికుడు రియాక్టర్‌ను నిర్వహించలేరు. పేలుడుకు ఈ ఫ్యాక్టరీ యాజమాన్యమే బాధ్యత వహిస్తుంది. ఈ ప్రాంతంలో దాదాపు 450 ఫ్యాక్టరీలు ఉన్నాయి.

ఇది మొదటి సంఘటన కాదు, 2016 నుండి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది ఆరవది. కళ్యాణ్‌ డోంబివిలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కెడిఎంసి) అగ్నిమాపక అధికారి దత్తాత్రేయ షెల్కే మాట్లాడుతూ ? ఫ్యాక్టరీ పక్కనే పెయింట్‌ కంపెనీ ఉందని చెప్పారు. అక్కడ ఇంకా మంటలు చెలరేగుతున్నాయన్నారు. ఘటనా స్థలంలో పెయింట్‌ కంపెనీతో పాటు కూలింగ్‌ ఆపరేషన్లు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఉదయం మరో మూడు మఅతదేహాలను వెలికితీశారు. ఇప్పుడు మొత్తం మరణాల సంఖ్య 10కి చేరింది. ఈ విషయంపై ఎన్‌డిఆర్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సారంగ్‌ కుర్వే మాట్లాడుతూ  మంటలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి సాధారణంగా ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP