24-05-2024 RJ
జాతీయం
తిరువనంతపురం, మే 24: మానర్కాడ్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ చాలా వేగంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కోళ్ల ఫారాలు ఉన్న ఒక కి.విూ పరిధిలో ఉన్న పెంపుడు పక్షులను వెంటనే చంపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని కోడి, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్టీ ఉత్పత్తుల విక్రయాలను ప్రభుత్వం ప్రస్తుతం నిషేధించింది. ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు రసాయనాలు స్పే చేస్తున్నారు. కోళ్ల ఫారం నుంచి 1 నుంచి 10 కి.విూ మేర పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించామని అధికారులు పేర్కొన్నారు. కొట్టాయం జిల్లాలో చికెన్, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్టీ ఉత్పత్తుల అమ్మకం, దిగుమతిపై అధికారులు నిషేధం విధించారు.