25-05-2024 RJ
జాతీయం
తిరువనంతపురం, మే 25: కేరళలో కుండపోత వాన కురుస్తోంది. గత రెండు రోజులుగా కేరళలో వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఈ మేరకు ఏడు జిల్లాలకు శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది.
ఈ జిల్లాల్లో 6 సెంటీవిూటర్ల నుంచి 11 సెంటీవిూటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్ తెలిపారు. మే 9 నుంచి 23 వరకూ ఈ మరణాలు నమోదైనట్లు చెప్పారు. 11 మందిలో ఆరుగురు నీటిలో గల్లంతై మరణించగా.. క్వారీ ప్రమాదంలో ఇద్దరు, పిడుగుబాటుకు ఇద్దరు, ఇల్లు కూలి ఒకరు మరణించినట్లు వెల్లడిరచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటి ప్రవాహాలు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.