28-05-2024 RJ
జాతీయం
లక్నో, మే 28: దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆ పరమాత్మే తనను పంపారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహల్ మాట్లాడుతూ.. ’మనలో ప్రతి ఒక్కరూ జీవసంబంధమైన వారు. కానీ నరేంద్ర మోడీ జీవసంబంధమైన వారు కాదు. సేవ చేయడానికి ఆయనను పరమాత్మ పంపారు. అయితే రైతులు, కార్మికులకు సేవ చేసేందుకు పరమాత్మ ప్రధాని నరేంద్ర మోడీని పంపలేదు.
కానీ అంబానీ, అదానీలకు సాయం చేయడానికే పరమాత్మ ఆయనను పంపారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగా పరమాత్మ మోడీని పంపి ఉంటే ఆయన పేదలు, రైతులకు సాయపడేవారని రాహుల్ చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నుల సేవలో మోడీ తరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యల్ని కాషాయనేతలు విస్మరిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.