29-05-2024 RJ
జాతీయం
కోల్‌కతా, మే 29: పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ఈసారి కనీవినీ ఎరుగనంతగా బీజేపీకి ప్రజల మద్దతు కనిపిస్తోందని, ప్రజల ఆదరణ అనూహ్యంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మరోసారి మోదీ సర్కార్ వస్తుంది‘ అనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలు ఇచ్చారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మధురాఫూర్ బుధవారంనాడు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, కోల్‌కతాలో జరిపిన రోడ్‌షోలో ప్రజలు చూపిన ఆదరణ ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు. ‘‘2024 ఎన్నికల్లో కోల్‌కతాలో విూతో పాల్గొంటున్న చివరి సమావేశం ఇది. ఇక్కడి నుంచి ఒడిశా, పంజాబ్ వెళ్తున్నాను. గురువారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఇవాళ విూ నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే విూ ఆశీస్సులు నావెంటే ఉన్నాయని బలంగా నమ్ముతున్నాను‘ అని ప్రజలను ఉద్దేశించి మోదీ అన్నారు.
’వికసిత్ భారత్’ దిశగా ఇండియా పయనం సాగిస్తోందని, అందుకోసం వికసిత్ బెంగాల్ చాలా కీలకమని చెప్పారు. ఇది సాధ్యం కావాలంటే ఇదే విజన్ ఉన్న ఎంపీలను గెలిపించుకోవాలని, తద్వారా తమకు ఆశీస్సులు అందించాలని ప్రధాని కోరారు. బుజ్జగింపు రాజకీయాల కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రధాని మండిపడ్డారు. ఓబీసీల హక్కులను ఊడలాక్కుని ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలనుకుంటోందనన్నారు. ఓబీసీ సర్టిఫికెట్లను కోల్‌కతా కోర్టు రద్దు చేసిందని, జూన్ 1న వికసిత్ బెంగాల్‌కు ప్రజల ఓట్లే కీలకమని చెప్పారు. బెంగాల్ ప్రజలకు ఉద్దేశించిన అవకాశాలను చొరబాటుదారుల పరం కానున్నాయని మోదీ హెచ్చరించారు. సీఏఏను టీఎంసీ ఎందుకు టీఎంసీ వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. చొరబాటుదారులకు ఇక్కడ సుస్ధిరస్థానం కల్పించాలనే ఆలోచనే ఇందుకు కారణమని మోదీ వివరించారు.