29-05-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, మే 29: ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్‌తో జతకట్టామని, ఇది శాశ్వతం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుతం దేశంలో నియంత పాలన, గుండాగిరి నడుస్తుంది.. దీనికి చరమ గీతం పాడడం కోసమే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు శాశ్వతంగా ఉండదని ఈ సందర్బంగా కేజీవ్రాల్ కుండ బద్దలు కొట్టారు. బుధవారం విూడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీవ్రాల్ మాట్లాడారు.
జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వెలువడ నున్నాయని.. అందులో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని కేజీవ్రాల్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. పక్కనే ఉన్న పంజాబ్‌లో మాత్రం ఆప్, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలుగానే బరిలో నిలిచామని ఆయన వివరించారు. దేశాన్ని రక్షించడం కోసం.. బీజేపీని ఓడిరచడం కోసమే కాంగ్రెస్, ఆప్‌లు కలిసి ఒక అభ్యర్థిని బరిలో దింపామని కేజీవ్రాల్ స్పష్టం చేశారు. అయితే పంజాబ్‌లో బీజేపీకి మనుగడ లేదన్నారు.
అలాగే ఢిల్లీ మద్యం కేసు.. మనీ లాండరింగ్ వ్యవహారంలో తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. అయితే తాను సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ మాత్రమే కోరుకుంటుందని కేజీవ్రాల్ పేర్కొన్నారు. ఇక బీజేపీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం దేశంలో ప్రముఖ రాజకీయ నేతలంతా జైళ్లలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే పుతిన్ సారథ్యంలో రష్యాలో పరిస్థితి ఎలా ఉందో.. దాదాపు అదే పరిస్థితి భారత్‌లో వస్తుందన్నారు. రోవైపు తన పార్టీ నేతలు సత్యంద్ర జైన్, మనీష్ సిసోడియాలు బీజేపీలో చేరితే వెంటనే బెయిల్ లభిస్తుందంటూ ఆ పార్టీ నేతల నుంచి సందేశాలు వెళ్లినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు.
ఇక సీఎం కేజీవ్రాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఘటనపై స్పందించేందుకు కేజీవ్రాల్ నిరాకరించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని కేజీవ్రాల్ పునరుద్ఘాటించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే అమిత్ షా ప్రధాని అవుతారని.. అలాగే యూపీ సీఎం పోస్ట్ నుంచి యోగి ఆదిత్యనాథ్ దిగిపోతారంటూ వివిధ వేదికల విూద నుంచి కేజీవ్రాల్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.