01-06-2024 RJ
జాతీయం
అహ్మదాబాద్, జూన్ 1: డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి సాహాసానికైనా వెనుకాడటం లేదు. అయితే.. ఈసారి స్మగర్లు చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆ బాక్స్ కస్టమ్ అధికారుల కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూడగా.. రూ. కోటి కంటే ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ లభ్యమైంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ.కోటికిపైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.15 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు.