01-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 1: లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు క్రమంగా వెలువడుతున్నాయి. మెజారిటీ పోల్ సర్వేలు ఎన్డీయే 350కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం పార్టీ 57 నుంచి 65 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని ఇండియా టీవీ, సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఇండియా కూటమి 59 నుంచి 66 సీట్లు, ఇతరులు 4 నుంచి 7 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 సీట్లుకు గాను టీడీపీ 13 నుంచి 15 సీట్లు, బీజేపీ 4-6 సీట్లు, జనసేన పార్టీ 2 సీట్లు, వైఎస్‌ఆర్‌సీపీ 3-5 సీట్లు గెలుకుంటుందని వెల్లడిరచింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరువదని తేలిపోయింది. దీనిని బట్ట కడపలో షర్మిల ఓటమి ఖాయమని తెలుస్తోంది.
కర్ణాటక 28 సీట్లలో ఎన్డీయే 20 నుంచి 24 సీట్లు, బీజేపీ 18-22, జేడీఎస్ 1-3, కాంగ్రెస్ 4-8 సీట్లు గెలుచుకుంటాయి. తెలంగాణ 17 సీట్లలో బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 6-8, బీఆర్‌ఎస్ సున్నా నుంచి ఒకటి, ఏఐఎంఐఎం 1 సీటు గెలుచుకుంటాయని అంచనా వేశారు. కేరళ 20 సీట్లకు గాను బీజేపీ 1 నుంచి 3 గెలుచుకుని ఖాతా తెరవబోతోంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 13 నుంచి 15, ఎల్‌డీఎఫ్ 3 నుంచి 5 సీట్లు గెలుచుకుంటాయి. తమిళనాడు 39 సీట్లలో బీజేపీ 5 నుంచి 7, డీఎంకే 16-18, కాంగ్రెస్ 6-8, ఏఐఏడీఎంకే సున్నా నుంచి ఒకటి, ఇతరులు 8 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారు. పుదుచ్చేరి బిజేపీకే దక్కుతుందని అంచనా వేశారు.