02-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 2: గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఎక్స్(ట్విటర్) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణ మని తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు.
ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. తెలంగాణప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. దేశాభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిది.. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు.. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో ఈ రాష్టాభ్రివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం..నరేంద్ర మోదీ..