02-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై సోనియా వీడియో సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.. తెలంగాణ అమరులకు శ్రద్దాంజలి ఘటించిన సోనియా.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో గౌరవించారని.. ప్రజల కల నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. అమరవీరుల కలలను నెరవేర్చాలి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను.. రేవంత్ సర్కార్ అమలు చేస్తుందని ఆశిస్తున్నా అంటూ.. సోనియా వీడియో సందేశంలో పేర్కొన్నారు.