ad1
ad1
Card image cap
Tags  

  03-06-2024       RJ

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పక్రియ

జాతీయం

  • ఈ ఎన్నికల్లో ఓటేసిన 64.2 కోట్ల మంది భారతీయులు
  • ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఇసి
  • 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగం
  • మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జూన్‌ 3: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడిరచారు. మంగళవారం  వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రత్యేకంగా విూడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ..  దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని రాజీవ్‌కుమార్‌ అన్నారు.

ఓటింగ్‌లో భారత్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ మేం ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ సిటిజన్‌, మహిళా ఓటర్లకు సెల్యూట్‌ చేశారు. దేశవ్యాప్తంగా 64.20 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సీఈసీ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారని తెలిపారు. 31.2 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికలను 68,763 బృందాలు పర్యవేక్షించాయని.. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4 లక్షల వాహనాలను ఉపయోగించామని తెలిపారు.

27 రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రీపోలింగ్‌ అవసరం రాలేదని చెప్పారు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కి తగ్గిందన్నారు. అందులో కేవలం రెండు రాష్టాల్లోన్రే 25 చోట్ల పోలింగ్‌ జరిగిందని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైందని సీఈసీ తెలిపారు. అక్కడ 58.58 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇక ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని వెల్లడిరచారు. రూ.10వేల కోట్ల నగదు, కానుకలు, డ్రగ్స్‌, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయని పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం.ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు. 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండిరగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పక్రియ ఇదే. 1.5కోట్ల మంది పోలింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. 68,763 బృందాలు ఈ ఎన్నికలను పర్యవేక్షించాయి. 135 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చాం. ఎన్నికల ఏర్పాట్ల కోసం 4లక్షల వాహనాలను ఉపయోగించాం. 27 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్‌ అవసరం రాలేదు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గింది. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్‌ జరిగింది.

గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది. మొత్తం అక్కడ 58.58శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కశ్మీర్‌ లోయలో 51.05శాతం పోలింగ్‌ నమోదైంది.   ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నాం. రూ.10వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్‌, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. 2019లో ఈ సంఖ్య రూ.3,500కోట్లుగా ఉంది.   ఈ ఎన్నికల సమయంలో సీ`విజిల్‌ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించాం. ఇందులో 87.5శాతం వాటికి 100 నిమిషాల్లోపే పరిష్కారం చూపాం. డీప్‌ఫేక్‌ వీడియోలను నిలువరించాం. ఇక, జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపుపై ఈసీ స్పందించారు. కౌంటింగ్‌ పక్రియ చాలా పటిష్ఠంగా జరగనున్నట్లు తెలిపారు.

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP